Popular Posts

29, నవంబర్ 2013, శుక్రవారం


కారుణ్య మరణం
దేవుడా రక్షించకు ఈ దేశాన్ని
మురిగిపొతున్న మనవ సమూహవ్యర్ధాన్ని
మానవత్వాన్ని మరచిన సజీవ కళేబరాల కోసం,
అన్యాయాన్ని నిర్భయంగా నిలదీయలేని మేధావుల కోసం,
కాయాన్ని కాసుల కోసం  ఖరీదు కట్టే అధికారుల కోసం,
అవినీతే నీతి గా నిరుపించే బడా బాబుల బడాయిల కోసం,
పేదల్నే పెరుగన్నం లా తినే పెద్దల కోసం,
కన్నవారిని కట్టుకున్నవాళ్ళను కాల్చుకు తినే కసాయిలకోసం,
మనిషి మనిషి కి మధ్య గోడలు కట్టి ,
 గొడవలు పెట్టి, పదవుల కొసం ,పదిరూపాయలకోసం,
మతాలను కులాలను వాడుకునే దగుల్బాజీ దద్దమ్మల కోసం,
రూపాయి కోసం పాపాయినైనా చంపే రౌడీరాక్షసుల కోసం,
బలాత్కారాన్ని వీరోచితకార్యమనుకునే అర్థణాగాళ్ళకోసం,
చెరువుల్ని చెరుకుగడల్లా తిని చదరాలు కింద అమ్మే చేపల కోసం,
బాల్యం నుంచే స్వార్థాన్నిఉగ్గుపాలుగ పోసే కన్నవారికోసం,
దేవుడా రక్షించకు ఈ దేశాన్ని


ప్రభూ దయ ఉంచి క్షమించు
ముందు నిన్ను మరిచాం
తర్వాత మనుషుల మనే మాటే మరిచాం
అన్నమిచ్చే మన్నుని మరిచాం,వెన్నునిచ్చిన తల్లిని మరిచాం
పాపమనే భయాన్ని మరిచాం
పుణ్యమనే తలపును మరిచాం
డబ్బు అనే కొత్త దేవుణ్ణి కొలిచాం
ఎన్ని అందలాలెక్కినా
ఎంత సంపాదించినా
 చివరకు మన్నై పోతామనే ఊసే మరిచాం
                                                                                                                ~  ఎం ఏ రావు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి